Thursday, July 13, 2023

కవీ అద్దం!

 

 ఉన్నవే ఉంటాయి

ఏవీ అప్పటి కప్పుడు పుట్టుకు రావు

 

మనకేది అబద్ధమో

అదే మరోప్రపంచమని ఊరిస్తాడు కవి

 

కవిత లెందుకు

ఎవరి కలల్ని వాళ్లు కనే తీరిక లేకనే

 

కవికి తెలుసు

రాసినా రాయకున్న ప్రతి మనిషీ కవే

 

సో, కవిని విమ

ర్శించడమంటే పాఠక ఆత్మపరిశీలనే!

 

జూన్ 3, 2023

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...