ఒద్దనుకున్నా వొచ్చి కావిలించుకునే కాంతి కావాలి
నన్నో చిన్ని పాపను చేసి తాను అమ్మై ఎత్తుకెళ్లాలి;
మరి నేనేమో మెల్ల మెల్లగా మెత్తగా రెప్పలు విప్పి
కను రెప్పల మీద ఒక మెత్తని మెలకువను పూసి
“పద పద, బయం గియం వొదిలి ఇక పద, మళ్లొచ్చి
చీకటమ్మ నల్లని కొంగు కింద నిద్దర మూలల్లో ఆడు
కుందువులె”మ్మని, పాట పాడాలి, ప్రతి రాత్రి ఇలాగే
నల్లని కొండెక్కి, గోగుపూల వనమెక్కి, వెన్నెలలు మెక్కి
ఎక్కడెక్కడో తిరిగి అలసిపోదువు గాని, మళ్లీ దుప్పటి
తొలగి “పని లోకి పదమ”ని సూరి మామ ప్రేమగా తన
తెల్ల తెల్లని రాగాలపై మరో కవాతు గీతం పాడే వరకు
2 ఎ ఎం; జూన్ 16, 2023
No comments:
Post a Comment