Showing posts with label Recent/తెలుగు /కవిత్వం/Telugu poetry/HRK /హెచ్చార్కె. Show all posts
Showing posts with label Recent/తెలుగు /కవిత్వం/Telugu poetry/HRK /హెచ్చార్కె. Show all posts

Sunday, July 16, 2023

మక్రాన్ గారూ రాజీ చేసుకోండి! (రాయబారంలో మొదటి పద్యం)

ఫ్రాన్స్ తగలబడుతోంది

మోదీలూ బైడెన్ లూ చలి కాచుకోకండి
1968 గుర్తుకు వస్తోంది
కవిత లాంటి వాస్తవం, వాస్తవమే కవిత
యుక్రేన్ తో ఆగదు, తైవాన్ తో ఆగదు
శాంతి కావాలా మీకు
పంచండి దాచుకున్న అదనం సమస్తం
దాచిపెట్టిన మీ భోగవిలాసాల్ని ఇకపై
కత్తులు కాపాడలేవు, కల్లలు కాపాడలేవు
అందరూ తింటానికి కావలసినంత ఉంది
అందరుంటానికి వలసినంత స్థలముంది
మీ కొందరికే ఉండిపోవాలని కూడా కాదు మీ కోరిక,
ఎందరికో లేక పోవడమే మీకు ఆనందం
పొరుగువాడి కన్నీళ్లు మీ ద్రాక్షాసవాలు
తగలబడండి, లేదా వదిలెయ్యండి కలుగుల వంటి
చీకటి అంతఃపురాలను, పునాదుల్లోని సంపదలను
ఫ్రాన్సు తగలబడుతోంది
ఈ మంటలు వ్యాపిస్తాయి
బడా దొంగలు పూర్తిగా సిగ్గొదిలినప్పుడు
ప్రజలు వాళ్ల మీద పడి దొంగ సొమ్మును దోచుకుంటారు
చట్టబద్దతా నీతిగీత 'మన' కోసం కాదు, 'మా' కోసమని
నువ్వు సిగ్గు విడిచి ప్రకటించేస్తావు,
గీత దాటితే శిక్షిస్తానని ప్రగల్భిస్తావు
మంచికీ చెడుకూ మధ్యనే, ప్రేమ ద్వేషాల మధ్యనే గీత;
రాచక అరాచకాల మధ్య, నీతి అవినీతుల మధ్య గీత
లిక తగలబడతాయి; బూడిదతో... నువ్వు కాదు,
మనం... ఇంకో గీత గీసుకుందాం, వస్తావా ఛస్తావా?!
ఇది సంక్షోభం, ప్రారంభ సంరంభం, ప్రపంచ సంగ్రామం
ఒక యుక్రేన్, ఒక తైవాన్, మరో కొరియా కాదు బరి,
మానవ న్యాయానికీ పరమ స్వార్థానికి మధ్యనున్న
నో మాన్స్ ల్యాండ్ నుంచి మోగుతోంది సమర భేరి
మక్రాన్ మహాశయా! నిద్దర్లేచిన ఫ్రాన్సు ఎప్పట్లాగే
సకల జగతి సమర గీతి
మరో ‘అంతం కాదిది ఆరంభం’, లేదా
ఏంజిలా కాట్రోచ్చీ పాటకు కొనసాగింపు
'మూషికf డిగాల్’ అన్న పిల్లలు మిమ్మల్ని
పందికొక్కు అనకముందే రాజీ చేసేసుకోండి
ఈసారికి బతికిపొండి.
హెచ్చార్కె
మొబైల్ (వాట్సాప్) +16096472863
జూన్ 1, 2023

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...