ఫ్రాన్స్ తగలబడుతోంది
మోదీలూ బైడెన్ లూ చలి కాచుకోకండికవిత లాంటి వాస్తవం, వాస్తవమే కవితయుక్రేన్ తో ఆగదు, తైవాన్ తో ఆగదుశాంతి కావాలా మీకుపంచండి దాచుకున్న అదనం సమస్తందాచిపెట్టిన మీ భోగవిలాసాల్ని ఇకపైకత్తులు కాపాడలేవు, కల్లలు కాపాడలేవుఅందరూ తింటానికి కావలసినంత ఉందిఅందరుంటానికి వలసినంత స్థలముందిమీ కొందరికే ఉండిపోవాలని కూడా కాదు మీ కోరిక,ఎందరికో లేక పోవడమే మీకు ఆనందంపొరుగువాడి కన్నీళ్లు మీ ద్రాక్షాసవాలుతగలబడండి, లేదా వదిలెయ్యండి కలుగుల వంటిచీకటి అంతఃపురాలను, పునాదుల్లోని సంపదలనుఫ్రాన్సు తగలబడుతోందిఈ మంటలు వ్యాపిస్తాయిబడా దొంగలు పూర్తిగా సిగ్గొదిలినప్పుడుప్రజలు వాళ్ల మీద పడి దొంగ సొమ్మును దోచుకుంటారుచట్టబద్దతా నీతిగీత 'మన' కోసం కాదు, 'మా' కోసమనినువ్వు సిగ్గు విడిచి ప్రకటించేస్తావు,గీత దాటితే శిక్షిస్తానని ప్రగల్భిస్తావుమంచికీ చెడుకూ మధ్యనే, ప్రేమ ద్వేషాల మధ్యనే గీత;రాచక అరాచకాల మధ్య, నీతి అవినీతుల మధ్య గీతలిక తగలబడతాయి; బూడిదతో... నువ్వు కాదు,మనం... ఇంకో గీత గీసుకుందాం, వస్తావా ఛస్తావా?!ఇది సంక్షోభం, ప్రారంభ సంరంభం, ప్రపంచ సంగ్రామంఒక యుక్రేన్, ఒక తైవాన్, మరో కొరియా కాదు బరి,మానవ న్యాయానికీ పరమ స్వార్థానికి మధ్యనున్ననో మాన్స్ ల్యాండ్ నుంచి మోగుతోంది సమర భేరిమక్రాన్ మహాశయా! నిద్దర్లేచిన ఫ్రాన్సు ఎప్పట్లాగేసకల జగతి సమర గీతిమరో ‘అంతం కాదిది ఆరంభం’, లేదాఏంజిలా కాట్రోచ్చీ పాటకు కొనసాగింపు'మూషికf డిగాల్’ అన్న పిల్లలు మిమ్మల్నిపందికొక్కు అనకముందే రాజీ చేసేసుకోండిఈసారికి బతికిపొండి.హెచ్చార్కెమొబైల్ (వాట్సాప్) +16096472863జూన్ 1, 2023
Sunday, July 16, 2023
మక్రాన్ గారూ రాజీ చేసుకోండి! (రాయబారంలో మొదటి పద్యం)
Subscribe to:
Post Comments (Atom)
సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8
మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...
No comments:
Post a Comment