కవితలు చెప్పుకునే వేళ కాదిది
కాళ్లు కడుక్కునే వేళ కూడా కాదు,
ఇదొక మహా శిశ్న చ్ఛేద సమయం
ఇల్లు లేదు, కప్పుకోడానికేం లేదు
బిచ్చం దొరకక పోతే ఆకలి తీరదు
అయినా నిద్ర వొచ్చేస్తుంది ఎలాగో
నిద్రపోతే గజిబిజి తీగెల కలల్లో
నాకు తెలియని ఏవేవో లోకాలు,
తినడానికి ఏదో దొరుకుతుంది
చచ్చిపోయే వరకూ ఇలాగే నేను
నిద్రలోనికీ బయటికీ నా పచార్లు
గుడివో బడివో అంగడివో ఆ మెట్ల
పరుపు మీద పడుకుని, కూర్చుని,
నుంచుని నిద్రపోతాను, ఇంతలో
మురిగిన ఆకాశం నుంచి వాన
కురిసే శిశ్న సేవకుల ఉచ్చల నుంచి,
కనీసం ఆ ఉచ్చల నుంచి నా నిద్రను
కాపాడుతావుట్రా రాముడా, దేవుడా!
లేకపోతే నాలా మతిచెడిన వాళ్లు, చెడని
వాళ్లు మెలకువలోనికి వచ్చి ఏంచేస్తార్రా,
పడగల్లాగే, వెయ్యి శిశ్నాల ఛేదం వినా?!
జూన్ 9, 2023
No comments:
Post a Comment