Monday, July 17, 2023

ఒద్దు బైడెన్ గారు, ఒద్దు పుటిన్ గారూ! ఒద్దొద్దు క్లస్టర్ బాంబులు!!

 వీత్నాంలో, కంపూచియాలోరెండు యుద్దాల చివరి దశలో చేసిన పాడు పని క్లస్టర్ బాంబులను ప్రయోగించడం.

ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం అలాంటి చివరి దశకు చేరిందా?
క్లస్టర్ బాంబు అంటే... ఒక బాంబు గాల్లోనే చాల బాంబులుగా విడిపోయి ఒకే సారి చాల చోట్ల పేలడం. ఆ చోట్లన్నీ సైనికులవే కానక్కర్లేదు. ఇందులో నిర్దిష్ట గురికి (ప్రెసిషన్ కు) అవకాశం తక్కువ. విడిపోయిన బాంబులు పడే అన్ని చోట్లను ఒకే సారి జాగ్రత్తగా గురి చూడలేరు. కొల్లేటరల్ డ్యామేజ్ అనబడే దానికి అవకాశం ఎక్కువ. అంటే, యుద్ధంతో సంబంధం లేని పౌరులు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోలేరు. యుక్రెయిన్ కు అమెరికా ఇచ్చిన తరహా క్లస్టర్ బాంబులు తమ దగ్గర కూడా అవి ఉన్నాయని రష్యా ప్రకటించింది. అంటే ‘మీరుపయోగిస్తే మేము కూడా ఉపయోగిస్తాం, ఖబడ్దార’ని రష్యా చెబుతోంది.
ఇంతకూ క్లస్టర్ బాంబులు పడే ప్రదేశాలేవి?
రష్యా అధీనంలోని యుక్రెయిన్ భాగాలపైనే వొలోదిమీర్ జెలెన్స్కీ బాంబులు వేస్తాడు. వ్లాదిమీర్ పుటిన్ కూడా యుక్రెయిన్ భాగాలపైనే వేస్తాడు.
ఇరువాగుల నుంచి ఈ క్లస్టర్ బాంబుల దుర్మార్గానికి బలి అవుతున్నదెవరు? యుక్రేనియన్ పౌరులే. శాంతికి ఉన్న అవకాశాల్ని పాడు చేస్తున్నదెవరైనా, వాళ్లను చరిత్ర క్షమించదు.
జులై 17, 2023

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...