Showing posts with label ఫేస్ బుక్ పోస్టులు/హెచ్చార్కె/ Facebook posts/ HRK. Show all posts
Showing posts with label ఫేస్ బుక్ పోస్టులు/హెచ్చార్కె/ Facebook posts/ HRK. Show all posts

Monday, July 17, 2023

ఒద్దు బైడెన్ గారు, ఒద్దు పుటిన్ గారూ! ఒద్దొద్దు క్లస్టర్ బాంబులు!!

 వీత్నాంలో, కంపూచియాలోరెండు యుద్దాల చివరి దశలో చేసిన పాడు పని క్లస్టర్ బాంబులను ప్రయోగించడం.

ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం అలాంటి చివరి దశకు చేరిందా?
క్లస్టర్ బాంబు అంటే... ఒక బాంబు గాల్లోనే చాల బాంబులుగా విడిపోయి ఒకే సారి చాల చోట్ల పేలడం. ఆ చోట్లన్నీ సైనికులవే కానక్కర్లేదు. ఇందులో నిర్దిష్ట గురికి (ప్రెసిషన్ కు) అవకాశం తక్కువ. విడిపోయిన బాంబులు పడే అన్ని చోట్లను ఒకే సారి జాగ్రత్తగా గురి చూడలేరు. కొల్లేటరల్ డ్యామేజ్ అనబడే దానికి అవకాశం ఎక్కువ. అంటే, యుద్ధంతో సంబంధం లేని పౌరులు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోలేరు. యుక్రెయిన్ కు అమెరికా ఇచ్చిన తరహా క్లస్టర్ బాంబులు తమ దగ్గర కూడా అవి ఉన్నాయని రష్యా ప్రకటించింది. అంటే ‘మీరుపయోగిస్తే మేము కూడా ఉపయోగిస్తాం, ఖబడ్దార’ని రష్యా చెబుతోంది.
ఇంతకూ క్లస్టర్ బాంబులు పడే ప్రదేశాలేవి?
రష్యా అధీనంలోని యుక్రెయిన్ భాగాలపైనే వొలోదిమీర్ జెలెన్స్కీ బాంబులు వేస్తాడు. వ్లాదిమీర్ పుటిన్ కూడా యుక్రెయిన్ భాగాలపైనే వేస్తాడు.
ఇరువాగుల నుంచి ఈ క్లస్టర్ బాంబుల దుర్మార్గానికి బలి అవుతున్నదెవరు? యుక్రేనియన్ పౌరులే. శాంతికి ఉన్న అవకాశాల్ని పాడు చేస్తున్నదెవరైనా, వాళ్లను చరిత్ర క్షమించదు.
జులై 17, 2023

Sunday, July 16, 2023

ఇంకో మొదలు

 

వెళ్లిపోతుంటాను
తిరిగి రావడంలోని
సంతోషం కోసమని
అలిగి అలిగి
వెళిపోతుంటాను, మీరు
బ్రతిమాలుకుంటారని
వాక్యం చివరి
పూర్ణబిందులంటే ఇష్టం
తిరిగి మొదలెట్టవచ్చని
మరణం ఆట
అంటే ఇష్టం, ఇలా మరో
పుటకను ఆడుకోవచ్చని
తాత్పర్యం: ఆ ఫేస్ బుక్ అకౌంటును విజయవంతంగా డీయాక్టివేట్ చేసేశాను. పూర్తి పేరుతో ఉన్న ఇదొక్కటే వాడుతున్నాను. ఈ ప్రొఫైల్ తో పంపిన ఫ్రెండ్షిప్ రిక్వెస్టులు పలువురు స్నేహితుల వద్ద పెండింగ్ లో ఉన్నాయి. కొందరు అవి ఫేక్ అనుకోడం కారణం. మితృలందరూ నా రిక్వెస్టులను అంగీకరించాలని విన్నపం.
No photo description available.
All reactions:

కాపీ టైమ్స్!


అదేంటో ఇవాళ నాక్కూడా పండిత వేషం వేయాలనిపిస్తోంది. వేషమే. పండితుడిని కావాలన్లేదు. కాపీ కాపీ అంటన్నారు కదా, నాకొక కాపీ గుర్తుకొచ్చింది. ముదిగొండ శివప్రసాదు గారి 'మహా సర్గ'. ఇది పుస్తక శీర్షికలోనే కాదు, పద్యాల నడకలో, పదాల వినిమయంలో మహాప్రస్థానం కాపీ. 'భారతి కన్నీళ్ల లోన కలం ముంచి రాస్తున్నా' అని మొదలవుతుందని గుర్తు. శ్రీశ్రీ మరో ప్రపంచం గేయాన్ని తిరుగరాసి కృశా తాను రాసిన కవితగా అచ్చేసుకున్నాడు అప్పటి కృష్ణా పత్రికలో. అట్టాగే కృశా 'చంద్రికల నేల వెదజల్లు చందమామ/ ఏల నా మనసు ప్రేమించు నిన్ను' ఒక ఇంగ్లీషు పద్యానికి అప్రకటిత అనువాదం అని విన్నాను. ఈ మాట నాకు చెప్పిన సదాశివరావు ఇప్పుడు లేరు. కొత్త సదాశివ రావులెవ్వరొ తెల్పుడీ వీరకవులని పొగుడుతాం.

జూన్ 13, 2023




సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...