హలో
అక్షరం
కాన్నేను
ఇక్కడ
ప్రతిదీ
క్షరమే
అక్షరాన్ని
వెదుకుతున్నా
సమస్త లోకాలు
సమస్త రాగాలు
సమస్త మస్తకాలు
అచ్చయినవి, కానివి
సమస్త పుస్తకాలున్నూ
దొరికితే
నీతో పంచుకుంటా
ఉంటే ఇక్కడ
ఇక్కడ లేకుంటే
ఎక్కడుంటానో
అక్కడి నుంచి,
అదే
అదొక్కటే
నా
మరణానంతరం
తదుపరి
జనన పూర్వము
లేదా
అదేం లేదా
ఇంతేనా
నిన్న రాత్రి
నిద్దర లాగేనా
అయితే పోనీ
నాతో పాటు నువ్వు
నా తరువాత నువ్వు
రాగం కొన సాగుతుంది
ఎవరూ ఉండమా?
ఉండకపోతే నేం?
మా వాలీ గాడు
తన పల్చని కాళ్లతో
నాట్యం చేయడానికి
లలిత లలితమైన ఒక
పాట కావాలన్నాడని
చాల వెదికాను
నాలో
అంతటా
ఒక ఫ్రెంచి వీధి
ఒక యుక్రేన్ వంతెన
ఒక అమెరికన్ బడి
రగులుతున్న
జెరూసలేం దేవాలయాలు
తమ సంచిలో
మెత్తని పాటలున్న వాళ్లు
పంచండి వాటిని
వాటితో పాటు
వ్యాలీ తల్లికి బువ్వగా
కాసిని మమతలు
లవ్స్ టు వన్ అండ్ ఆల్
ప్రేమలు
ఒక్కొక్కరికీ అందరికీ
(వ్యాలీ: మా ఇంటి సన్ కొన్యూర్, రాంచిలక
వాడు నా చేతిలోనో, నేను వాడి చేతిలోనో? )
జూన్ 6, 2023
No comments:
Post a Comment