ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మంచిదని నేను చెప్పబోతున్నట్టు
ఒక బేస్లెస్ ఆరోపణ. నాకు తెలీనిది తెలుసు అని నేనెలా చెబుతాను? నాకు తెలిసి ఉంటే తెలిదని ఆ పోస్టులో ఎందుకు చెబుతాను?
Annexure:
(copied from the Facebook conversation)
అసురా, శీను, ఇంకా
ఇతర స్నేహితులారా!సాంస్కృతిక వైవిధ్యం ముసుగు కింద ఇవాళ ఇండియాలో వర్థిల్లుతున్నది
మత వైవిధ్యం మాత్రమే. వైదిక కులాలు, ఇతర మతాల్లోని
దొంతర్లు... సాంస్కృతికం కన్న ఎక్కువగా... మత సంబంధాలు. ఇవి మత నియమ బద్ధాలు,
పూజారి, ఫాదిరీ, మౌళ్వీ
పర్యవేక్షితాలు. ఈ పరిస్థితే ముద్దు అనడం... యథాతథ వాదానికి ముద్దు పేరు. 'ఎవరి పర్సనల్ లా వాళ్లది' అనేది ఇవాళవర్థిల్లుతున్న
చెత్త. దీన్ని గౌరవించడమంటే... 'నా పెండ్లాం నా ఇష్టం'
అనడాన్ని గౌరవించడమే. ఆ వైఖరి కేవలం నిరుటిది కాదు. ఆ వైఖరిఎట్
లార్జ్ ఇప్పటికీ ఉంది. దానిలో చట్టం జోక్యం చేసుకోవాలి. మతం కాదు, చట్టం జోక్యం చేసుకోవాలి. చట్టమే స్త్రీల వంటి డిజడ్వాంటేజ్డ్ సెక్షన్లకు
రక్ష. చట్టం జోక్యం చేసుకోవాలంటే ఈ సో కాల్డ్ వైవిధ్యం పోవాలి. దీన్ని సో కాల్డ్
వైవిధ్యమనే నేను అంటాను. ఎందుకంటే, ఇది మతం అనే పాముచే మింగబడిన
సాంస్కృతిక వైవిధ్యం. సంస్కృతిని మతం నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఉంది.
ఇక ఇప్పటి ప్రభుత్వం వల్ల ఆ పని సక్రమంగా జరగదు అనడం
కుదరదు. ఈ దేశ ప్రజలకు ఇష్టం అయినంత కాలం ఇప్పటి ప్రభుత్వమే ఉంటుంది. ఇది ఉండే
కాలం మరి రెండేండ్లు కావొచ్చు, చాల ఏండ్లు కావొచ్చు. ('చాల ఏండ్లు' అని నా అంచెనా. ఒకసారి ఓడిపోయినా
అమెరికాలో రిపబ్లికన్ల మాదిరి మళ్లీ మళ్లీ వొస్తూనే ఉంటుందని నా అంచెనా). కనుక,
ఈ ప్రభుత్వం పోయాక యూనిఫామ్ పర్సనల్ లా కు ఒప్పుకుంటాం అనడం కుదరదు.
రావలసిన చట్టం సరిగ్గా ఉండేట్టు చూసేది (లేక చూడలేకపోయేది) ప్రజా ప్రతిఘటనే. మన
వంటి కొందరి కోరికలు కాదు. మన కోరికలు సైతం నిగ్గు తేలాల్సింది సామాజిక చర్య అనే
కురుక్షేత్రంలోనే. మన కోరికలు ప్రజా సామాజిక చర్య రూపం ధరించినంత వరకే వీటికి
సార్థకత. లేకుంటే వ్యర్థమైన ఎంటర్టైన్మెంటు మాత్రమే.
Srinivas Kandla
Kunta
ఏకరూపత ఎక్కడ రాగలుగుతుందో అక్కడ వస్తుంది. ఉదాహరణకు, వివాహ వయస్సు. కొన్నిటికి సమాజం సిద్ధంగా ఉండదు, దాన్ని
సిద్ధపరచాలి. చట్టం సిద్ధపరచదు. ఆమోదనీయత వచ్చిన సంస్కారానికి ముద్ర వేస్తుంది.
హిందువుల్లో బహుభార్యాత్వం 1955 లో నిషిద్ధం అయింది. గోవా లో
ఇప్పటికీ పాక్షికంగా చట్టబద్ధమే.అనేక గిరిజన తెగల్లో సంప్రదాయమే. కొన్నిటి విషయంలో
సంధి దశ ఉంటుంది. హిందూ వివాహ చట్టం ఉంటుంది, పౌర వివాహ
చట్టమూ ఉంటుంది. హిందువులు ఎంచుకోవచ్చు. పౌర వివాహ చట్టం అన్ని ఇతర మతాలకు కూడా
ఐచ్ఛికమే. హిందూ అవిభక్త కుటుంబ చట్టం హిందువులకు మాత్రమే ఉన్న సౌకర్యం. మేనరికం
చట్టప్రకారం నిషిద్ధం, హిందువుల్లో కొందరికి సంప్రదాయం. కొంత
సంస్కరణల వల్ల, కొన్నిటిని ఎవరిది వారికి వదిలేయడం వల్ల,
కొన్ని సంప్రదింపుల వల్ల పరిష్కారం అవుతాయి. ఇప్పటి స్థితిలో ఒక
చట్టం సాధ్యపడదని లా కమిషన్ చెప్పింది. సాధ్యం చేయాలనుకుంటున్న కేంద్రానికి
దురుద్దేశాలు ఉన్నాయి.
'కొన్నిటికి సమాజం సిద్ధంగా ఉండదు, దాన్ని సిద్ధపరచాలి. చట్టం సిద్ధపరచదు.' మరి ఎవరు
సిద్ధపరచాలి? ప్రజల్లో చర్చ సిద్ధపరచాలి. చర్చ దేనికి?
చట్టం ఏకరూపకత దిశగా ప్రజల మనస్సులను సిద్ధ-పరచడానికి. ఇప్పడు,
దాన్ని వద్దని, అది సాంసకృతిక వైవిధ్యానికి
భగ్నమని మేధావి మితృలు చేస్తున్న ప్రచార-స్థాయి వాదం ప్రజలను దేనికి
సిద్ధపరుస్తుంది? ఏకరూపకత వద్దనే దానికి సిద్ధపరుస్తుంది.
మేధావుల వాదాలు, ప్రచారాల వల్ల సాధారణ ప్రజలు చాల ఎక్కువగా
ప్రభావితులవుతారు. (మన అభిప్రాయాలన్నీ కూడా అలా తయారైనవే, స్వయం-సిద్ధమైనవి
ఏవీ లేవు). మరి మనం ప్రజాభిప్రాయాన్ని ఏ దిశగా ప్రభావితం చేస్తున్నాం.
మీరు చెప్పే 'ఇంకా ఉన్న ఆచారాలు'
నిజమే. చట్టం వచ్చినా ఇంకా ఉన్నాయి అని వేటిని అంటున్నామో అవి
వాంఛనీయాలా? ఆ వైవిధ్యం వాంఛనీయమా? కాదు.
పర్సనల్ లా లో ఏకరూపతే వాంఛనీయం అని దాదాపు అందరూ వొప్పుకుంటున్నారు. ప్రజలు
సిద్ధంగాలేరు అనే మాటతో వొద్దని అంటున్నారు. ఈ ఆచారాలు జనాల్లో ఉన్నాయి. చాల
సందర్భాల్లో ఇవి చెదరుమదురు, వ్యక్తిగతాలు. సామూహికాలు కాదు,
'హిందువుల'లో బహుభార్యాత్వం లాగ, వివాహేతర సంబంధాల లాగ. అవి ఉంటాయి. జనాల్లో ఉన్నాయి కనుక, వాటిని చట్టబద్ధంగా ఉంచాలనడం సరి కాదు. వాటికి ఉన్న చట్టబద్ధతను ఉంచాలనడం
సరికాదు. దొంగతనం, హత్యలు లేవూ? ఎప్పటి
నుంచో ఉన్నాయి. ఇంకా చాల కాలం ఉంటాయి. మరి వాటిని వొద్దనే చట్టం ఎందుకు? పోనీ వరకట్నం ఆచారం ఇప్పుడు లేదూ? ఉంది. మరి దాన్ని
నిషేధించే చట్టం ఎందుకూ? ఎందుకంటే ఆ పనులూ ఆచారాల వల్ల
బాదితులైన వారికి చట్టం అండగా ఉంటుంది. బాధితుల పోరాటానికి రాజ్యం, రాజ్యాంగం అండగా ఉంటాయి. ఉండాలి. అందుకని చట్టం సరిగ్గా ఉండాలి. సమగ్రంగా
ఉండాలి. ఆపైని మేధావులు (పత్రికలు, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా
ఎట్సెటరా) ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. కేంద్రానికి దురుద్దేశాలు ఉన్నాయి?
అవి మనకు తెలుసా, ఏమిటవి? అవేవో ఉన్నాయని తెలిసీ బట్టబయలు చేయకపోవడం మన వైపు నుంచి తప్పు కూడా.
ఎన్నికల వేళ, రాజకీయ ప్రయోజనం పొందాలని ఇలా చేస్తున్నారు?
అలా చేస్తేనేం? ఏ పార్టీ అయినా ఆ దృష్టితోనే
పని చేస్తుంది. ఏ దృష్టితో చేసినా, చేస్తున్న పని మంచిదా
చెడ్డదా అని చూడాలి. ఏకరూప పౌరస్మృతి స్త్రీలకు, దళితులకు,
డిజట్వాంటేజ్డ్ సెక్షన్లకు మంచి చేస్తుంది. దానిలో చోటు చేసుకోబోయే
చెడ్డలు ఏవో వాటిని చూపించి, వాటిని తొలగింపజేయడానికి
పోరాడాలి. ప్రజల కళ్ల ముందు నిరూపణ లేని 'దురుద్దేశాల'
పేరిట భయాందోళనలను పెంచడం మన పని కాదు. మంచి పని కాదు, అవతల ఉన్నది బీజేపీ అయినప్పటికీ.
దారిలో చెత్తకుప్పలను పోగేసి వాటికి అంటుబెడుతూ పోవాలి, మ్యునిసిపల్ వర్కర్ల లాగ.లేకుంటే, మెదళ్లలోని చీకటి తగలబడదు
No comments:
Post a Comment