- Like
To be expanded into an
article
సెల్ఫ్
అంటే మరేం లేదు. అటాచ్మెంట్.
నా
పేరుప్రతిష్టలకు... నా అటాచ్మెంట్
నా
దేశానికి నా జాతికి నా అటాచ్మెంట్
బ్యాంకు
బ్యాలెన్స్ ఉంచుకో. 'దేశా'న్ని ఉంచుకో,
'జాతి'ని ఉంచుకో
వాటితో
నీకు జీవితావసరాలు ఉన్నంత వరకు; వాటికి అతుక్కోకు.
భార్యా
బిడ్డలను ఉంచుకో, బాధ్యత వహించు; అతుక్కోకు
ఈ
మాటలు ఎవరివో అడక్కు. చెప్పను;
చెబితో ఆతడికి అతుక్కుపోతావు నువ్వు.
1980 ప్రాంతాల్లో ఒక మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలో ఒక చర్చ జరిగింది. అది ఏదో ఇన్ ఫార్మల్ (సాదా సీదా) చర్చ కాదు. తరువాత్తరువాత ఆ పార్టీ రెండుగా చీలిపోవడానికి దారి తీసిన పెద్ద చర్చ. అందులో రెండు ముఖ్యాంశాలు:
1. భారత
దేశంలో ప్రధాన వైరుధ్యం ఏమిటి అనేది ఒక అంశం.
ఫాసిజానికి, ప్రజాస్వామ్యానికి
మధ్య వైరుధ్యమే ఇవాళ ( పోనీ, అవాళ) ప్రధాన వైరుధ్యమని
పార్టీలో ఒక బృందం వాదించింది. అందువల్ల ఫాసిజానికి ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్
(ఐ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య సంఘటన కట్టాలన్నారు. ఆ ఐక్య సంఘటనలో కార్మిక
వర్గం (అనగా పార్టీ) తో పాటు ఇంకా ఎవరెవరు ఉంటారు? చాల
ప్రజాతంత్ర శక్తులతో పాటు ‘కాంగీ’ ఫాసిజాన్ని వ్యతిరేకించే ‘ఆరెసెస్’ కూడా అందులో
భాగస్వామి అవుతుంది. (ఎమర్జెన్సీని ఎదిరించి, చెరసాలల్లో
మగ్గిన వాళ్లలో ఆరెసెస్ వాళ్లు కూడా ఉన్నారు మరి). ఆ ఐక్య సంఘటనలో ఇంకా ఎవరెవరు
భాగస్వాములవాల్సి ఉండిందో ఆ వివరాలు ఇప్పటి చర్చకు అవసరం లేదు.
ఆ
బృందం మరో ప్రతిపాదన కూడా చేసింది. అది అంతర్జాతీయ పరిస్థితికి సంబంధించినది.
ఇవాళ
(అదే, అవాళ) ప్రపంచం మూడో ప్రపంచ యుద్దం ముంగిట నిలబడి వుంది. బాగా విస్తరించిన
అమెరికా సామ్రాజ్యవాదానికి, దాన్ని ఎదిరించి కొత్తగా
విస్తరించాలనుకుంటున్న సోవియెట్ సోషల్ సామ్రాజ్యవాదానికి మధ్య ఈ యుద్దం
అనివార్యంగా వస్తుంది. యుద్దం అమెరికాకు అవసరం లేదు. అది బాగా బలిసి తన స్థితిని
నిలబెట్టుకోవలసిన డిఫెన్సివ్ పొజిషన్ లో ఉంది. రష్యా సోషల్ సామ్రాజ్యవాదం యుద్దం
చేసి విస్తరించాల్సిన అఫెన్సివ్ పొజిషన్ లో ఉంది. సో, అమెరికా
అనుకూల (ఆరెసెస్ తదితర) శక్తులతో ఐక్య సంఘటన ఇలా కూడా సమర్థనీయమే.
ఇప్పుడు
బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ను కావిలించుకోవాలనే మితృల వాదం దాదాపు అలాంటిదే
అని నా అభిప్రాయం.
ఫాసిజం
అనే దాని ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుందని, ఆ ప్రమాదం ఏ పార్టీ
నుంచి వొచ్చినా ఎదిరించడానికి ప్రజలను ప్రేమించే వారు, ప్రజలు
సిద్ధంగా ఉండాలని, ఈ విషయంలో యూనిటరీ నిరంకుశాధికారానికి
పీఠాలుగా పని చేసే పార్టీల మీద కాకుండా స్థానిక, ప్రాదేశిక
శక్తుల సమీకరణ మీద ఆధారపడాలన్నదే ఈ అనుభవాల తరువాత నా ఆభిప్రాయం.
ఇక మీ
ఇష్టం. ![]()
4.30 ఎ ఎం,
మే 16, 2023
హాయిగా జంతువుల్లా బతకండి అన్నాడని రామగోపాల్ వర్మను చాల చాల కోప్పడుతున్నారు. ఇప్పుడు మనుషులు జంతువుల్లా కూడా లేరే, మరి, వర్మ మీద ఎందుకంత కోపం?
జంతువులు తమ మీద తాము బాంబులు వేసుకుని
చావవు. ఆశ్విజ్ లు, కాన్సెంట్రేషన్ శిబిరాలు నిర్వహించవు. రేపులు, హత్యలు చేయవు. ఇతర స్వజాతి జంతువుల దుఃఖాన్ని, మరణాన్ని
ఆనందించవు. ఇతర స్వజాతి జంతువులనైనా, ఏ జంతువులనైనా చిత్ర
హింసల పాలు చేయవు. అబద్ధాలు చెప్పవు. ఆహార సేకరణలో, వేటలో మోసాలు
చేయవు. ఇవన్నీ చేసే మనుషులు జంతువుల కన్న ఎందువల్ల ఎక్కువ?
ఏదో నవలలో ప్రేమికులు అడివిలో పడి
జంతువుల్లా తిరుగుతూ బతకడం, మగ పాత్ర గర్భవతి ఐన ఆడ పాత్రను తన్నడం వంటి... జంతువులు
చేయని హైన్యాలు చేస్తుంటే.. లొట్టలు వేసుకుంటూ చదివి... అది స్వేచ్ఛ అని ఆనందించడం,
సెక్స్ అంటే హింస అనిపించే పోర్నో సినిమాలను కళ్లు పగిలిన
పత్తికాయలు చేసుకుని చూడడం... ఇవన్నీ చేసే మనం... జంతువుల కన్న ఎందువల్ల ఎక్కువ?
మనం జంతువుల కన్న 'ఎక్కువ'గా ఉండొద్దని కాదు నేను అంటున్నది. లేము అని. ఉంటానికి ప్రయత్నాలు కూడా
పెద్దగా లేవు అని. మనుషులుగా ఉండటం ఎలాగో చెప్పడానికి ప్రయత్నించిన బుద్ధుడు,
క్రీస్తు, కార్ల్ మార్క్స్, మార్టిన్ లూథర్ కింగ్, అంబేడ్కర్లను వాళ్ల జీవిత కాలాల్లో
పట్టించుకోకపోగా రకరకాలుగా హింసించి, దేశ బహిష్కరించి,
ఆకలికి మాడ్చి... వాళ్లు పోయాక, విగ్రహాల్ని
చేసి ఇంకా హింసించడమేగా మనం చేస్తున్నది?! మరి, వర్మనూ ఆయన గారి అయన్ ర్యాండిజాన్ని ఎందుకు విమర్శించడం?
విమర్శించొద్దని కాదు. విమర్శించాలి. విమర్శలలో
మన మాటలకు తగినట్టు మనం బతకాలి. 'నా జీవితంలో నేను పక్షీంద్రుడనే’ అని గొప్ప గట్వంగా చెప్పుకునే ఒక దళిత రచయిత, అగ్రవర్ణ
శ్రీ శ్రీ కవి సెక్స్ వర్కర్ల తో సెక్సించినందుకు బండ దూషిస్తాడు. అలాంటి అబద్ధపు
జీవితాలైనా కాస్త తగ్గిద్దామా?! మన హిపోక్రసీ గురించి
మాట్లాడే సాహసం చేసినందుకు స్నేహితులపై 'మలం ఎత్తి పోసే'
మనస్తత్వాల్ని, మనల్ని మనం వెలేసుకుని,
వెలివేత గురించి సానుభూతికి జోలెలు పట్టే కుయుక్తలనైనా వొదిలేద్దామా?!
హిపోక్రసీని తిరస్కరించే పనిలోనే
ఎప్పటికైనా నిజాన్ని చేరుతాం. లేకుంటే ఎప్పటికీ అబద్ధాల ఊబిలోనే ఇలాగే ఛస్తాం...
నగ్నముని ఎక్కడో అన్నట్టు ‘ఆర్తనాదమే మన ఆఖరి నినాద’మవుతుంది.
మార్చ్ 17, 2023
అయితే నా అనుచరుడిగా ఉండు
లేకుంటే
నా వ్యతిరేకి అనుచరుడిగా ఉండు.
అయితే
వైవధ్యం పేరిట వెనుకబాటును కావిలించుకో.
లేకుంటే, ఏకత పేరిట ఏదో ఒక మతం నీడకు చేరిపో.
మధ్యలో
ఇదేంది నువ్వు నువ్వుగా ఉంటున్నావు?
అంటున్నారు
ఇరువాగుల మనుషులు!
*
ఓర్నీ,
ఇదా మీరు. ఒకేసారి ఇద్దరితో, ఇందరితో యుద్ధమా?
మిగిలిన ఈ
విరిగిన రథ చక్రం ఒక్కటే ఆయుధమా?
*
ఛెళ్, సాగనీ పోరు.
ప్రతిసారీ
ఒకేలా ముగియదు యుద్ధం!
ఈసారి ఈ పద్మ
దళాల్ని చేదిస్తాను, నా దారిలో నేను!
మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...