Saturday, October 21, 2017

9. హమ్మింగ్ బర్డ్


నిన్ను చూసినప్పుడు నిన్ను విన్నప్పడు
కవిత్వం రాయకపోతే నేను బతికున్నట్టు కాదు
బతికి వున్నా నేను నేనైనట్టు కానే కాదు
నువ్వు వొక పువ్వువి, పువ్వులోనికి ముక్కు పెట్టి
అతి వేగంగా రెక్కలల్లారుస్తూ గాలిలో నిలబడి
తీయ తేనెలు తాగే హమ్మింగ్ బర్డ్ ని నేను
అప్పుటి నా అతివేగపు రెక్కల విసురు కవిత్వం
కవిత్వం నన్ను ఖాళీ గాలిలో నిలబెడుతుంది
నువ్వు నా కవిత్వపు రెక్కలు, థాంక్స్ టు యూ
నాకు కళ్లుండడం వల్ల కాదు
చెవులుండడం వల్ల, చర్మముండడం వల్ల కాదు
నువ్వుంటం వల్ల నేనున్నాను
ఆకలితో పువ్వు మీద వాలే తేనె పిట్టలో ముసిరే కాంక్షా స్పర్శ
అది వాలుతున్నప్పుడు పువ్వు పిల్ల ఆనందంలోని చిరు వణుకు
వణుకులోని సృష్టి రహస్యం, పువ్వులోపలి తేనె, తేనెలోపలి తీపి,
యెప్పుడు నే కవిత్వమవుతానో ఆ క్షణం, అన్నీ నువ్వే నా నువ్వే
21-10-2017

No comments:

Post a Comment