Monday, October 23, 2017

10. తూనీగ


తదేకంగా చూడు
యెగురుతున్న తూనీగ వెంట నీ కంటిని పంపించు
వూర్నే, గట్టు మీద కూర్చో
నువ్వెక్కడికీ వెళ్లకు, వెళ్లాల్సింది చూపు మాత్రమే
చూపుల వాహనం తూనీగ
వొక పాప కళ్లతో పాటు రెండు ప్లాస్టిక్ గ్లాసులు తీసుకెళ్తుంది
తను మరీ చిన్నది, నీ వలె తూనీగ పెద్ద కళ్లకు కనపడదు
పాపాయి మెత్తగా నడిచి తూనీగ మీద గ్లాసులు మూసి
కల కల నవ్వి తెరిచిరాజు అంటుంది. రాజు ఆగిపోతాడు
పాప ప్రేమగా గ్లాసులు తెరుస్తుంది, రాజు హెలికాప్టర్‍ లా
నిట్టనిలువుగా ఝుమ్మని యెగిరిపోతాడు నీ చూపునూ
మోసుకుపోతాడు, నువ్వు నిన్ను వెదుక్కుంటూ వుండిపోతావు
పాపాయిలకేం బోల్డంత మంది రాజులు వాళ్లకు బోల్డన్ని రాజ్యాలు
యీ పాపాయిలను ముట్టుకున్నామా, యిక, యింతే
అంతా వాళ్లే అవుతారు, అంతటా వాళ్లే వుంటారు, వాళ్ల
చేతులలోని ప్లాస్టిక్ గ్లాసులలో కాసేపయినా పుంఢాలని
యెప్పుడూ కొన్ని తూనీగలుంటాయి, వాటి మూపులపై
కళ్లెం లేని స్వారీ చేస్తూ యెప్పుడూ కొన్ని నేనులుంటాం
23-102017

No comments:

Post a Comment