Tuesday, January 31, 2017

5. సరస్సు హసనం

తన నుంచి తాను వెళిపోయి
అతడలా వుండిపోతాడు
తన వొడ్డు మీద తానుండి 
తన లోనికి తాను గాలం విసిరిన జాలరి
కొలనులో నీరు కదలదు
లోపల ఒక స్వప్న మీనం నవ్వుకుంటుంది
ఉండి వుండి వుండి కొలను నిద్ర పోతుంది
అతడూ నిద్ర పోతాడు
నిద్రపోక ఏం చేస్తాడు?
ఇటీవల నిద్దట్లో మాత్రమే జీవిస్తున్న వాడు
ఎంతో కొంత తనకు తాను లేనప్పుడే
నిజంగా వుంటున్నాడు ఈ మాత్రమైనా
*
పేటిక మూసుకుంటోంది, నిద్ర వంటి పేటిక
మనసులో ఏం వుందో
అది చెప్పడం ఇక ముందు సాధ్యం కాదు
లోలోపల నవ్వుకోడమే
31-1-2017

No comments:

Post a Comment