Saturday, January 21, 2017

2. ఎవరిది మెలకువ?

అర్ధరాత్రి లేచి వెళ్లి 
నీ దగ్గర పడుకోనా అని
ఆడుగుతాడతడు ఆమెకు ఏదో ఇస్తున్నట్లు
పడుకోడమైనా లేచి వెళ్లడమైనా
అతడి ప్రతి కదలిక అతడి కోసమే
నిద్దర నిద్దర కళ్ళతో ఆమె నవ్వుతుంది
ఆమెకు అన్నీ తెలుసు. కాసేపుంటే లేచి వెళిపోతాడు
ఇక్కడ నిద్దర రావడం లేదంటో, అశాంతుడు
ఆమె అప్పుడు కూడా నవ్వుతుంది
నిద్దట్లోంచి కనిపించని పల్చని చేతులు చేతులు చాచి
అతడి ముఖం మీద పడుతున్న కురులు సర్దుతుంది
పాపాయి పడిపోకుండా పొత్తిలి గుడ్డలు సర్దినట్లు
ఏం చేయాలో ప్రతి సారీ నిర్ణయం తనదే అనుకుంటాడతడు
తనను అలా అనికోనిమ్మని ఆమెను అడుగుతాడు కూడా
ఆమె సరేనని కలవరిస్తుంది నిద్దట్లో నవ్వుతూ.
1.20 A M, 21-1-2017

No comments:

Post a Comment